చీర కట్టుకుని ఆకాశంలో సాహసం చేసిన పూణే మహిళ... అద్భుత వీడియో చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చీర కట్టుకుని ఆకాశంలో సాహసం చేసిన పూణే మహిళ... అద్భుత వీడియో చూడండి

  • చీరలో స్కైడైవింగ్
  • ఈ విధమైన ప్రయత్నం ఇదే మొదటిసారి
  • ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా భిన్నంగా సాహసం
స్కైడైవింగ్ చేయడం ఎంతో సాహసంతో కూడుకున్నది అయితే, చీర కట్టుకుని ఆ పని చేసి ఔరా అనిపించింది పూణె మహిళ. ‘‘త్వరలో రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏదైనా భిన్నంగా చేయాలని అనుకున్నాను. దీంతో మహారాష్ట్ర వాసిగా నవ్వారి శారి కట్టుకుని స్కైడైవ్ చేయాలని నిర్ణయించుకున్నా’’ అని పూణె మహిళ శీతల్ రాణె మహాజన్ తెలిపారు.

స్కైడైవింగ్ ను చీర కట్టుకుని ఒకరు చేయడం ఇదే మొదటిసారి. సాధారణంగా సాహసాలు చేసే మహిళలు సౌకర్యం దృష్ట్యా చీర కాకుండా ఇతర పాశ్చాత్య దుస్తులు వేసుకోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, చీరలోనూ చేయవచ్చని నిరూపించారు మహాజన్.
pune
saree
skydiving

More Telugu News