మా నిర్ణయం టీడీపీకి మింగుడుపడటం లేదు..పారిపోయిన చరిత్ర మీది: అంబటి రాంబాబు
- పారిపోయిన చరిత్ర టీడీపీది
- ప్రజల కోసం త్యాగాలు చేస్తున్న చరిత్ర మాది
- రాష్ట్రాన్ని నట్టేట ముంచింది చంద్రబాబు కాదా?
జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని స్వాగతించకుండా... విమర్శించడం చాలా దారుణమని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా 10 రోజుల క్రితం రాజీనామాలు చేయమని కోరితే... పారిపోయిన చరిత్ర టీడీపీదని ఆయన ఎద్దేవా చేశారు. పదవులను పట్టుకుని వేలాడుతున్న మీరా డ్రామాలు ఆడుతోంది? ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నా మేమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు బయట టీడీపీ ఎంపీలు డ్రామాలు చేశారని... ఒక్కసారి వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని చెప్పారు. ప్యాకేజీ పేరుతో రాష్ట్రాన్ని నట్టేట ముంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్యాకేజీ అరుంధతి నక్షత్రం అయితే... హోదా సంజీవని లాంటిదని చెప్పారు.