ఇంటెక్స్ లయన్స్ టి1 వోల్టే స్మార్ట్ ఫోన్ విడుదల... ధర రూ.3,899
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంటెక్స్ లయన్స్ టి1 వోల్టే స్మార్ట్ ఫోన్ విడుదల... ధర రూ.3,899

  • మూడు రంగుల్లో లభ్యం
  • 5 అంగుళాల డిస్ ప్లే, 2.5డి కర్వ్ డ్ గ్లాస్
  • ఆండ్రాయిడ్ నౌగట్ వెర్షన్ పై పనిచేసే ఫోన్
దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇంటెక్స్, ఆక్వా శ్రేణిలో లయన్స్ టి1 లైట్ పేరుతో 4జీ వోల్టే ఫోన్ ను తక్కువ ధరకు విడుదల చేసింది. దీని ధర రూ.3,899. రాయల్ బ్లాక్, స్టీల్ గ్రే, చాంపేన్ రంగుల్లో లభిస్తుంది. కస్టమర్లకు గుర్తుండిపోయే కానుకను ఇవ్వడం ద్వారా  2018 సంవత్సరాన్ని ప్రారంభించాలనుకున్నామని, అందుకే 5 అంగుళాల స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకే తీసుకొచ్చామని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కండేయ తెలిపారు.

స్పెసిఫికేషన్లు
5 అంగుళాలు డిస్ ప్లే, 2.5డి కర్వ్ డ్ గ్లాస్, మీడియాటెక్ క్వాడ్ కోర్ 64 బిట్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 5 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ వెర్షన్ పై పనిచేస్తుంది.
intex
smart phone

More Telugu News