Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లిలో అరగంట డ్యాన్సుకు రూ.2 కోట్లు.. తిరస్కరించిన రణ్‌వీర్ సింగ్‌!

  • ప్రస్తుతం ‘గల్లీబాయ్‌’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న రణ్‌వీర్ సింగ్
  • పెళ్లికి వచ్చి డ్యాన్స్‌ చేస్తే సినిమాలో తన పాత్రపై శ్రద్ధ పెట్టలేనని చెప్పిన వైనం
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ‘గల్లీబాయ్‌’ విడుదల
భారీ విజయాలు నమోదు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కి రోజురోజుకీ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆయనతో పెళ్లిల్లో డ్యాన్స్ చేయించాలని కూడా కొందరు ముచ్చట పడుతున్నారు. ఇటీవల ఓ శ్రీమంతుడు తన ఇంట్లో జరిగే పెళ్లికి రణ్‌వీర్‌ అర్ధగంట పాటు డ్యాన్స్‌ చేయాలని, రూ.2 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.

అయితే, ‘గల్లీబాయ్‌’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న రణ్‌వీర్ సింగ్ అతడి కోరికను సున్నితంగా తిరస్కరించాడట. పెళ్లికి వచ్చి డ్యాన్స్‌ చేస్తే సినిమాలో తన పాత్రపై శ్రద్ధ పెట్టలేనని చెప్పాడట. కాగా, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ సినిమాల్లో నటించి భారీ విజయాలను అందుకున్న రణ్‌వీర్ సింగ్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ‘గల్లీబాయ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ranveer singh
Padmaavat
offer

More Telugu News