Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోహన్ బాబు చేసిన ఆ పాత్ర నాకు వస్తుందనుకున్నాను!: సీనియర్ నటుడు జీవా

  • నాటకాలు ఎక్కువగా వేసేవాడిని 
  • మా నాన్నకి ఇష్టం వుండేది కాదు 
  • 'స్వర్గం నరకం' సినిమాకోసం స్క్రీన్ టెస్ట్ కి వెళ్లాను  
  • ఆ పాత్ర మోహన్ బాబుకు దక్కింది  
సీనియర్ నటుడు జీవా తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన సినిమా ప్రయాణానికి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను నాటకాలు ఆడేవాడిని .. ఇంటికి ఆలస్యంగా రావడం మా నాన్నకి కోపాన్ని తెప్పించేది. కూటికొస్తుందా .. గుడ్డకొస్తుందా అనేవాడు. చిత్రమేమిటంటే ఆ నటనే నాకు అన్నం పెడుతోంది"

"నేను నాటకాలు వేస్తున్న సందర్భంలోనే, 'స్వర్గం నరకం' సినిమా కోసం ప్రకటన పడితే వెళ్లాను. విజయ అండ్ వాహినిలో డైలాగ్ ఇచ్చి .. స్క్రీన్ టెస్ట్ చేశారు. అప్పుడు మోహన్ బాబు కూడా వచ్చారు. ఆ వేషం నాకే వస్తుందని అందరి నమ్మకం. కానీ కట్ చేస్తే .. ఆ వేషం మోహన్ బాబుకి వెళ్లింది. మోహన్ బాబును చూశాను .. మంచి పొడగరి .. మంచి కలర్ .. బ్రహ్మాండంగా వున్నాడు. ఆ పాత్రకి నాకంటే ఆయనే కరెక్ట్ అని అప్పుడు అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.    
jeeva
mohan babu

More Telugu News