విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించిన కేటీఆర్.. ప్రతిజ్ఞ సారాంశం ఇదే!
- హైదరాబాదును పరిశుభ్రంగా ఉంచుతామంటూ ప్రతిజ్ఞ
- పరిశుభ్రత కోసం విద్యార్థులు కృషి చేయాలని పిలుపు
- ఏకకాలంలో రోడ్లను ఊడ్చిన 15,320 మంది విద్యార్థులు
ప్రతిజ్ఞ సారాంశం ఇదే:
- ఇంట్లోని తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేస్తాను.
- తడి చెత్తతో ఎరువు తయారు చేస్తాను.
- బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయను. ఇతరుల్లో కూడా చైతన్యం తీసుకొస్తాను.
- సరుకులు, కూరగాయలు తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ బ్యాగులు వాడను. క్లాత్ లేదా జ్యూట్ బ్యాగులనే వాడతాను.
- సిగరెట్ ను బహిరంగ ప్రదేశాలలో తాగను.
- పాన్ తిని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయను.
- చెత్తను కాల్చను. గాలిని కలుషితం చేయను.
- ఇంటి నిర్మాణ వ్యర్థాలను ప్రభుత్వం సూచించిన ప్రదేశాల్లోనే వేస్తాను.
- హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కంకణబద్ధుడనై ఉంటాను.