మిస్టర్ భగవత్, మీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఆర్ఎస్ఎస్ చీఫ్ పై రాహుల్ గాంధీ మండిపాటు
- ప్రతీ భారతీయుడికీ అవమానకరం
- దేశం కోసం ప్రాణాలు విడిచిన వారికి అగౌరవం
- ట్విట్టర్ లో మోహన్ భగవత్ పై రాహుల్ ఆగ్రహం
ప్రతీ జవాను సెల్యూట్ చేసిన భారత పతాకాన్ని అవమానించేలా వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. సందర్భం వస్తే దేశం కోసం పోరాడేందుకు ఆర్మీని మూడు రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ సిద్ధం చేయగలదని భగవత్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. ‘‘సంఘ్ మూడు రోజుల్లోనే మిలటరీని సన్నద్ధం చేయగలదు. అదే ఆర్మీకి అయితే 6-7 నెలలు పడుతుంది. ఇది మా సామర్థ్యం’’ అంటూ భగవత్ పేర్కొన్నారు.