Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి అవి పుకార్లే!

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ 
  • సంగీత దర్శకుడి అనిరుథ్ ఖరారు
  • మార్చి రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. త్రివిక్రమ్ .. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ ను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే 'అజ్ఞాతవాసి' ఆడియోకి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం వలన, అనిరుథ్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందువలన మరో సంగీత దర్శకుడు రంగంలోకి దిగే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ఇక ఈ సినిమా .. మధుబాబు వ్రాసిన ఒక నవల ఆధారంగా రూపొందుతుందనే వార్త కూడా హల్ చల్ చేస్తోంది. ఇక ఈ విషయంలోను ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. మార్చి రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా, దసరాకి ప్రేక్షకుల ముందుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.       
ntr
trivikram

More Telugu News