హార్వార్డ్ కు వెళ్లడం లేదు... క్షంతవ్యుడిని: కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హార్వార్డ్ కు వెళ్లడం లేదు... క్షంతవ్యుడిని: కేటీఆర్

  • ఇండియా కాన్ఫరెన్స్ కు కేటీఆర్ కు ఆహ్వానం
  • రాలేకపోతున్నట్టు వెల్లడించిన కేటీఆర్
  • వచ్చే సంవత్సరం వస్తానని వెల్లడి
ప్రతిష్ఠాత్మక హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ కు ఈ సంవత్సరం తాను హాజరు కాబోవడం లేదని, అందుకు క్షంతవ్యుడినని తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. వీలైతే వచ్చే సంవత్సరం అక్కడికి వస్తానని చెప్పారు. హార్వార్డ్ లో భారత విద్యార్థులు ప్రతియేటా ఇండియా కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తూ, ఇండియాకు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతారన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం పాల్గొని ప్రసంగించాలని కేటీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. తాను వెళతానని ఇటీవల ఆయన ప్రకటించారు కూడా. అయితే, ఏ కారణం చేత తాను హార్వార్డ్ కు వెళ్లలేకపోతున్నానన్న విషయాన్ని కేటీఆర్ వెల్లడించలేదు.
Harward
India Conference
KTR

More Telugu News