తన ప్రియుడిని కాపాడుకుంటానంటూ ఆత్మార్పణం చేసిన యువకుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన ప్రియుడిని కాపాడుకుంటానంటూ ఆత్మార్పణం చేసిన యువకుడు!

  • భోపాల్ లో కలకలం రేపిన యువకుడి ఆత్మహత్య
  • కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే నీలోత్పల్
  • పునర్జన్మపై నమ్మకంతోనే ఆత్మహత్య
తాను సహజీవనం చేస్తున్న యువకుడి ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ విద్యాధికుడు ఆత్మార్పణం చేసుకున్న ఘటన భోపాల్ లో జరిగింది. నానో టెక్నాలజీ రీసెర్చర్ గా ఉన్న నీలోప్తల్ సర్కార్ (27), తన గే పార్టనర్ ప్రాణాలను కాపాడుకుంటానంటూ ఆదివారం నాడు భోపాల్ అప్పర్ లేక్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాళికాదేవిపై అమితమైన భక్తి విశ్వాసాలను చూపే నీలోత్పల్, మరణానికి ముందు శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఓ లేఖ రాశాడు.

"డార్క్ మాటర్ ను అర్థం చేసుకోవాలంటే పరమశివుడిని అర్థం చేసుకోండి. బ్లాక్ హోల్ అర్థం కావాలంటే కాళికాదేవిని అర్థం చేసుకోండి. బిగ్ బ్యాంగ్ థియరీ తెలియాలంటే, 'ఓం' అనే భాషను నేర్చుకోండి" అని తన లేఖలో పేర్కొన్నాడు. తన చేతికి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ రాసిన ఓ ట్యాగ్ కట్టుకుని మరీ అతను చెరువులో దూకడంతో, తనను సాధ్యమైనంత త్వరగా గుర్తించి, కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించాలన్న ఉద్దేశం అతనిలో ఉండవచ్చని పోలీసు అధికారులు తెలిపారు.

ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు నీలోత్పల్ తన ఫేస్ బుక్ లో 'ఫైనల్ నోట్' అంటూ ఐదు నిమిషాల వీడియోను పోస్టు చేశాడు. దాన్ని చూసిన స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో అతని ఆచూకీ కోసం ప్రయత్నించినా దొరకలేదు. ఫోన్ అప్పటికే స్విచ్చాఫ్ వచ్చింది. గతంలో నీలోత్పల్ పోస్టు చేసిన మరో వీడియోలో తాను కాళికామాతను కలుసుకున్నానని, మరో ఏడాదిలో తన భాగస్వామి దొరుకుతాడని ఆమె చెప్పిందని పేర్కొని కలకలం సృష్టించాడు.

గతంలో గౌహతీలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లి, ఆపై నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన నీలోత్పల్ ను స్థానికులు కాపాడగా, కొంతకాలం మానసిక చికిత్స కూడా చేయించుకున్నాడు. అతను మరో పురుషుడితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని, అతనికి ఆరోగ్యం బాగాలేదని వెల్లడించారు. పునర్జన్మపై గట్టి నమ్మకాన్ని చూపే నీలోత్పల్, తన చావు అతన్ని కాపాడుతుందన్న ఉద్దేశంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
Bhopla
Nilotpal
Gay Partner

More Telugu News