హార్దిక్ పాండ్యా-బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన నటి!
Add ap7am to your home Screen

హార్దిక్ పాండ్యా-బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన నటి!

  • ప్రజలు బోల్డన్ని విషయాలు మాట్లాడుకుంటారు
  • స్పందిస్తే పుకార్లు మరింత పెరుగుతాయి
  • ఇప్పటికే ఎన్నో తప్పుడు వార్తలు రాశారు
  • బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్ ఆవేదన
టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాతో తాను డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్ స్పందించింది. ఇప్పుడీ విషయం గురించి తాను ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొంది. ప్రతీ విషయానికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని, ప్రజలు ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చని తేల్చి చెప్పింది. డేటింగ్ వార్తలపై స్పందిస్తే మరిన్ని పుకార్లకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని పేర్కొంది. ఇప్పటికే తన గురించి ఎన్నో తప్పుడు వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. సెలబ్రిటీల గురించి ప్రజలు ఏవేవో మాట్లాడుతుంటారని, అన్నింటికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ అవ్రమ్ హాజరైంది. హార్దిక్‌ పక్కన నిలబడి ఫొటోలకు పోజులివ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల ప్రవాహానికి అడ్డుకట్ట పడకపోవడంతో స్పందించిన ఎల్లీ ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో హార్దిక్ పాండ్యా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో డేటింగ్‌లో ఉన్నాడన్న వార్తలు కూడా హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తలను స్వయంగా హార్దిక్ ఖండించడంతో అక్కడితో ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది.
Hardik pandya
Elli avram
Cricket
Bollywood

More Telugu News