దేవుడి పైనా, మా అమ్మ పైనా ప్రామిస్ చేయడం కన్నా వీళ్ల పైన చేస్తున్నా: రామ్ గోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేవుడి పైనా, మా అమ్మ పైనా ప్రామిస్ చేయడం కన్నా వీళ్ల పైన చేస్తున్నా: రామ్ గోపాల్ వర్మ

  • ఈరోజు ప్రేమికుల ప్రామిస్ డే
  • ప్రామిస్ ను నిలబెట్టుకోనని చెప్పేందుకే ‘ప్రామిస్’ చేస్తున్నా
  • అమితాబ్, నాగార్జున .. మియా మల్కోవాపై ప్రామిస్ చేస్తున్నా
  • బాధ్యత గల వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తా: వర్మ ట్వీట్
ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం. ఈరోజు కోసం ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని కంటే ముందుగా రోజ్ డే, ప్రపోజ్ డే, చాకొలెట్ డే, టెడ్డీ డేలను జరుపుకుని ప్రేమికులు ఎంజాయ్ చేశారు. ఈరోజు ప్రామిస్ డేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు వర్మ స్పందించారు. పండగలుపబ్బాలు, ఆచారవ్యవహారాలు, రాజకీయనాయకులు .. ఇలా దేనిపైనైనా తన దైన మార్క్ తో పోస్ట్ లు చేసే వర్మ, ఈరోజు ఓ ట్వీట్ చేశారు.

‘నేను ప్రామిస్ ను నిలబెట్టుకోనని చెప్పేందుకు ‘ప్రామిస్’ చేస్తున్నా. ప్రామిస్ డే శుభాకాంక్షలు’ అని పేర్కొన్న వర్మ, ‘దేవుడి పైనా, మా అమ్మ పైనా ప్రామిస్ చేయడం కన్నా అమితాబ్ బచ్చన్, నాగార్జున, స్టీవెన్ స్పీల్ బర్గ్, దావూద్ ఇబ్రహీం, బ్రూస్ లీ, మియా మల్కోవాపై ప్రామిస్ చేస్తున్నా. ఈ ఏడాది బాధ్యత గల వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తా’ అంటూ ఆసక్తికర ట్వీట్ ను వర్మ చేశారు.
Tollywood
director
ram gopal varma

More Telugu News