cpi: ఏపీ ప్రజలను మరోసారి ఫూల్స్ ను చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది: సీపీఐ నేత రామకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్రజలను మరోసారి ఫూల్స్ ను చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోందంటూ సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. అమలు కాని ప్రకటనలతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ ప్రకటనలు వినీవినీ విసిగిపోయిన ఏపీ ప్రజలకు మళ్లీ పాతపాటే వినిపిస్తున్నారని విమర్శించారు.

ఏపీకి  పదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట వాస్తవం కాదా? ఏపీకి నాలుగేళ్లలో ఇవ్వలేని నిధులు రెండేళల్లో ఇస్తామంటే ప్రజలు నమ్మాలా? ఏడాదికి రూ.50 కోట్ల ముష్టితో ఒక జిల్లా అభివృద్ధి సాధ్యమా? అని ఆ లేఖలో రామకృష్ణ ప్రశ్నించారు. కాగా, ఏపీకి బీజేపీ ఏం చేసిందో వివరించడానికి తాను సిద్ధమని, అన్ని వివరాలు తన దగ్గర ఉన్నాయని ఆ పార్టీ నేత కంభంపాటి హరిబాబు పేర్కొన్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
cpi
ramakrishna

More Telugu News