'దట్స్ ద బ్యూటీ': రోశయ్యకు సన్మానసభలో వెంకయ్యనాయుడు
- కొణిజేటి రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
- అవార్డును అందించిన టీ సుబ్బరామిరెడ్డి
- ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు
ప్రధాని చెప్పినట్టుగా ఉత్తరాది వారు దక్షిణాధి భాషలను, దక్షిణాది వారు ఉత్తరాది భాషలను నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. "మన కట్టు, మన బొట్టు, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస... ఇవన్నీ మనం కాపాడుకోవాలి. మన భాషలో రమ్యత ఉంది. ఉత్తర తెలంగాణలో భాష ఓ రకంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణలో ఓ రకంగా ఉంటుంది. దట్స్ ది బ్యూటీ. యూనిటీ ఇన్ డైవర్శిటీ. తెలుగు పద్యాల్లోని లాలిత్యం ఎంత బాగుటుంది. దాన్ని కాపాడుకుందాం" అని అన్నారు. సుబ్బరామిరెడ్డి కళలకు ఎంతో సేవ చేస్తున్నారని అభినందించారు. పిల్లల్లోని ప్రతిభను మరింతగా ప్రోత్సహించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.