Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలాంటివి సహించను కనుకనే నేనంటే అయిష్టత!: మోహన్ బాబు

  • సెట్ కి వస్తే తీయబోయే సీన్ గురించే ఆలోచించాలి 
  • అక్కడ సెల్ ఫోన్లో మాట్లాడితే ఊరుకోను 
  • పేకాట ఆడితే ఒప్పుకోను 
  • ఈ పద్ధతే కొంతమందికి నచ్చదు  
నటుడిగా మోహన్ బాబు ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ వచ్చారు. ఎన్నో సన్మానాలను .. సత్కారాలను పొందుతూ వచ్చారు. అలాంటి మోహన్ బాబు తన కెరియర్ కి సంబంధించిన విషయాలను తాజాగా ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు. " నటుడిగా నేను చాలా అంకితభావంతో పనిచేస్తాను .. మిగతా వాళ్లూ అలాగే వుండాలని కోరుకుంటాను".

"సెట్ కి వస్తే అక్కడ తీయబోయే సన్నివేశానికి సంబంధించిన ఆలోచనలతోనే ఉండాలి. ఫోన్ మాట్లాడకూడదు .. సెట్లో పేకాట ఆడకూడదు. అక్కడ అలా జరుగుతుందీ అంటే దర్శకుడిదే తప్పు. నా సెట్లో ఒకసారి కొంతమంది పేకాట ఆడితే, నేరుగా వెళ్లి కాలుతో టేబుల్ ను తన్నాను. కొంతకాలం క్రితం .. అంతకుముందు కూడా ఇలాగే జరిగింది. అప్పటి నుంచి నా సెట్లో పేకాట ఆడే సాహసం ఎవరూ చేయరు. ఇలాంటి నా పద్ధతి కారణంగానే మోహన్ బాబు అంటే భయపడతారు .. అయిష్టత చూపిస్తారు" అని చెప్పుకొచ్చారు.     
mohan babu

More Telugu News