టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్ గెలిస్తే రికార్డే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్ గెలిస్తే రికార్డే!

  • వరుసగా మూడు వన్డేల విజయంతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా 
  • జోహన్నెస్  బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో నాలుగో వన్డే 
  • నేటి వన్డే గెలిస్తే సిరీస్ కైవసం
  • ద‌క్షిణాఫ్రికా గడ్డపై ఐదు లేక అంతకన్నా ఎక్కువ వన్డేల సిరీస్ గెలిచిన రెండో టీమ్‌గా భార‌త్ రికార్డు
దక్షిణాఫ్రికా, భారత్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా నాలుగో వన్డే కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే వరుసగా మూడు వన్డేలు ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఈ వన్డేలోనూ ఓడిపోతే సిరీస్ కోల్పోతుంది. నాలుగో వన్డే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతోంది.

టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వన్డేలోనూ గెలిచి దక్షిణాఫ్రికాపై రికార్డు విజయం సాధించాలని కోహ్లీ సేన ఉత్సాహంగా ఉంది. ఈ రోజు విజయం సాధిస్తే, ద‌క్షిణాఫ్రికా గడ్డపై ఐదు లేక అంతకన్నా ఎక్కువ వన్డేల సిరీస్ గెలిచిన రెండో టీమ్‌గా భార‌త్ రికార్డు నెల‌కొల్పుతుంది. 
India
south africa
Cricket

More Telugu News