Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిమ్‌ సోదరికి శత్రు దేశాధ్యక్షుడి పసందైన విందు!

  • కిమ్ జోంగ్ ఉన్ సోదరికి విందునిచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు  
  • వీఐపీ బాక్స్ లో కూర్చుని ప్రారంభోత్సవాన్ని వీక్షించిన కిమ్ సోదరి 
  • కిమ్ సోదరికి కాస్త దూరంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ కు దక్షిణ కొరియా పసందైన విందు ఇచ్చింది. గత కొంతకాలంగా దక్షిణ, ఉత్తరకొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వింటర్ ఒలిపింక్స్ సందర్భంగా దక్షిణ కొరియాకు వచ్చిన ఉ.కొరియా అధక్షుడు కిమ్ సోదరి కిమ్‌ యో జోంగ్ సహా, ఆ దేశ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ సియోల్ లోని తన అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు.

ఈ విందు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అనంతరం వీఐపీ బాక్స్ లో కూర్చుని కిమ్ యో జోంగ్ వింటర్ ఒలింపిక్స్ వేడుకల ప్రారంభోత్సవాన్ని వీక్షించారు. వారికి కాస్త దూరంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కూర్చోవడం మరింత ఆసక్తి రేపింది. కాగా, ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.
North Korea
south korea
USA

More Telugu News