నాకు తెలిసి నేను చేసిన తప్పు అదొక్కటే!: మోహన్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు తెలిసి నేను చేసిన తప్పు అదొక్కటే!: మోహన్ బాబు

  • కెరియర్ పరంగా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాను
  • ఎప్పుడూ సెక్రటరీని పెట్టుకోలేదు 
  • నేరుగా నేనే మాట్లాడేసరికి అలా అనుకునేవాళ్లు
తాజాగా ఐ డ్రీమ్స్ వారికి మోహన్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరోల .. హీరోయిన్ల సెక్రటరీల ప్రస్తావన వచ్చింది. అప్పుడు మోహన్ బాబు తనదైన శైలిలో స్పందిస్తూ ..  'నటుడిగా 43 సంవత్సరాలు .. నేను చేసిన తప్పేమిటంటే సెక్రటరీని పెట్టుకోకపోవడమే. తొలినాళ్లలో ఒక్కో సినిమా చేస్తూ లైమ్ లైట్ లోకి వస్తున్నాను. కేరక్టర్ ఆర్టిస్ట్ గా .. కమెడియన్ గా .. విలన్ గా .. హీరోగా చేస్తున్నా సెక్రటరీని పెట్టుకోలేదు .. అది నేను చేసిన తప్పు. నా డేట్స్ కి సంబంధించిన విషయాలన్నీ నేనే చూసుకునేవాడిని.

సెక్రటరీ వుంటే .. నిర్మాత డబ్బులు ఇవ్వకపోతే ఆఫీసుకి వెళ్లి రావలసిన డబ్బులు అడుగుతాడు. 'మా సార్ డబ్బిస్తేనే వస్తానని అన్నారండీ .. లేకపోతే రారండి .. స్పెషల్ గా కారు కావాలన్నారండి' అంటూ అడుగుతాడు. తిట్టుకుంటూనో .. నొచ్చుకుంటూనో నిర్మాత అవి ఏర్పాటు చేసేవాడు. నా విషయంలో నేనే డైరెక్ట్ గా మాట్లాడేసేవాడిని. నా కార్లో నేనే వస్తాను .. నా భోజనం నేనే తెప్పించుకుంటాను .. అనేవాడిని. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదని అడిగేవాడిని. దాంతో రఫ్ గా మాట్లాడతానని అనుకునేవారు. అందుకే సెక్రటరీని పెట్టుకోమని మా పిల్లలకు చెబుతుంటాను" అని అన్నారు.    
mohan babu

More Telugu News