Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రీ లుక్ తో వచ్చేసిన విజయ్‌ దేవరకొండ!

  • 'అర్జున్ రెడ్డి' తరువాత మూడు సినిమాల్లో నటిస్తున్న విజయ్ దేవరకొండ
  • జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల 
  • ఈ సినిమాకు పరిశీలనలో 'టాక్సీ డ్రైవర్' టైటిల్
‘అర్జున్‌రెడ్డి’ హిట్‌ తరువాత వరుస ఆఫర్లతో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో కొత్త దర్శకుడు రాహుల్‌  సాంకృత్యాన్‌ సినిమాను కూడా అంగీకరించాడు. ఈ సినిమా ప్రీలుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ లో పాతకాలంనాటి కారు దుమ్మురేపుతూ దూసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. దీనిని విజయ్‌ ట్విట్టర్‌ మాధ్యమంగా అభిమానులతో పంచుకున్నాడు.

‘సమయం వచ్చింది.. అయాం బ్యాక్‌’ అని ట్వీట్‌ చేశాడు. కాగా, ఈ సినిమాలో విజయ్‌ క్యాబ్‌ డ్రైవర్‌ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. దీనిని రొమాంటిక్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘టాక్సీవాలా’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రియాంకా జవాల్కర్‌ నాయికగా నటిస్తోంది.

కాగా, విజయ్ దేవరకొండ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో ‘సోలో’ ఫేం పరుశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్ మరో సినిమా నిర్మిస్తోంది. మరోపక్క, ‘మహానటి’ సావిత్రి బయోపిక్ లో విజయ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 
vijay devarakonda
letest movie
arjun reddy

More Telugu News