సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • శర్వానంద్ సరసన కల్యాణి ప్రియదర్శన్ 
  • 'రంగస్థలం' నుంచి ఒక పాట వస్తోంది!
  • అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ రెడీ 
  • 'ఘాజి' దర్శకుడితో వరుణ్ తేజ్
*  'హలో' చిత్రం ద్వారా పరిచయమైన కథానాయిక కల్యాణి ప్రియదర్శిన్ తన తదుపరి చిత్రాన్ని శర్వానంద్ సరసన చేయనుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.  
*  రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 'రంగస్థలం' చిత్రంలోని ఒక పాటను ఈ నెల 13న రిలీజ్ చేయనున్నారు. వచ్చే నెల 30న విడుదల కానున్న ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రలో చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత నటించారు.
*  'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న దర్శకుడు వీఐ ఆనంద్ తో సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఓకే చెప్పాడట. దీనికి సంబంధించిన స్టోరీ లైన్ కూడా ఓకే అయిందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం.
 *  తాజాగా 'తొలిప్రేమ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ నటించే తదుపరి చిత్రం షూటింగ్ మే నుంచి జరుగుతుంది. 'ఘాజి' ఫేం సంకల్ప్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తాడు. అంతరిక్షం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.   
kalyani
charan
samanta

More Telugu News