భారతీయ విద్యా భవన్ లో నా 'తొలి ప్రేమ' అనుభవం!: వరుణ్ తేజ్

  • తొమ్మిదో తరగతిలో ఉండగా తొలి ప్రేమ
  • చాలా రోజులు ఫోన్ లో మాట్లాడుకున్నాం
  • తరువాత మా దారులు వేరయ్యాయి
వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన 'తొలిప్రేమ' సినిమా నేడు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ తన తొలి ప్రేమ అనుభవాన్ని పంచుకున్నాడు. తనకు అమ్మాయిలంటే సిగ్గని, అలాంటి తనకు స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఒక ప్రేమానుభవం ఉందని అన్నాడు. భారతీయ విద్యాభవన్‌ లో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో తనకు ఒక అమ్మాయి పరిచయమైందని, ఆమె తనతో చొరవగా మాట్లాడేదని తెలిపాడు.

ఆ తరువాత ఆమె తన ఫోన్‌ నంబర్ కూడా ఇచ్చిందని, తామిద్దరం కొన్ని రోజులు మాట్లాడుకున్నామని చెప్పాడు. తరువాత తమ దారులు వేరయ్యాయని అన్నాడు. దానిని ఏమంటారో తెలియనప్పటికీ అదే తెలిసీ తెలియని తన తొలిప్రేమ అని వరుణ్ తేజ్ చెప్పాడు. తరువాత తానెవర్నీ ప్రేమించలేదని అన్నాడు. తన స్నేహితులు కొందరు ప్రేమ వివాహాలు చేసుకున్నారని చెప్పాడు. 'ఊహలు గుసగుసలాడె' సినిమాలో రాశీఖన్నా బాగా నటించడంతో ఈ సినిమాకి ఆమెను బెటర్ ఆప్షన్ గా భావించి తీసుకున్నారని అన్నాడు. 
Go Back to Shorts
varuntej
toliprema
rasikhanna

More Telugu News