Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెటిజన్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ సమంత!

  • నేనిప్పుడు ఒక కోట్‌ను పోస్ట్‌ చేయాలి
  • ఎందుకంటే ‌నా గత పోస్ట్‌ అంత అసభ్యకరంగా ఏమీ లేదు
  • నా రూల్స్ నేను రాసుకుంటా
  • మీ రూల్స్ మీరు రాసుకోండి
అక్కినేని వారి కోడలు, సినీ న‌టి సమంత తాను బికినీ వేసుకుని ఫొటో దిగి దాన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స‌మంత ఇలా షాక్ ఇచ్చిందేంటంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. కొంద‌రు ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పెళ్లైన స్త్రీ ఇలా బికినీ వేసుకుని ఫొటోలు దిగడ‌మే కాకుండా దాన్ని పోస్టు చేయ‌డం ఏంటని అంటున్నారు.

మ‌రికొంద‌రైతే మ‌రిన్ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో స‌మంత మ‌రోసారి సోష‌ల్ మీడియాలో మ‌రో పోస్ట్ చేసి గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చింది. తానిప్పుడు ఒక కోట్‌ను పోస్ట్‌ చేయాలని, ఎందుకంటే త‌న‌ గత పోస్ట్‌ అంత అసభ్యకరంగా ఏమీ లేదని ఆమె పేర్కొంది. త‌న‌ రూల్స్ తాను రాసుకుంటాన‌ని, అభిమానులు త‌న నియమాలు రాయడం కాదని, ఎవ‌రి రూల్స్ వాళ్లు రాసుకోండని కాస్త ఘాటుగా ట్వీట్ చేసింది.    
samantha
Twitter
warning

More Telugu News