సావిత్రిగారి సినిమాలో చేశాను ..ఆమెను చూస్తే బాధేసేది: నటుడు బెనర్జీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సావిత్రిగారి సినిమాలో చేశాను ..ఆమెను చూస్తే బాధేసేది: నటుడు బెనర్జీ

  • సావిత్రిగారి సినిమాలో చేశాను 
  • ఆమె చాలామంచి వారు 
  • ఆమెతో కలిసి నటించడం నా అదృష్టం
తీక్షణమైన చూపులతోనే విలనిజాన్ని పండిస్తూ బెనర్జీ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సీరియస్ గా వుండే పాత్రలనే ఎక్కువగా చేస్తూ వస్తోన్న ఆయన, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ సావిత్రి ప్రస్తావన తీసుకొచ్చారు. "సావిత్రి గారితో కలిసి పనిచేసే అవకాశం కలిగింది నాకు .. అది నా ఫస్టు సినిమా. 'హారిశ్చంద్రుడు' అనే సోషల్ డ్రామా అది .. ప్రభాకర్ రెడ్డి - సావిత్రి ప్రధానమైన పాత్రలను పోషించారు. విశ్వేశ్వర రావుగారు దర్శకులు .. నేను అసిస్టెంట్ డైరెక్టర్".

" ఆ సినిమాలో నేను నటించాను కూడా. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆమెతో బాగా మాట్లాడేవాడిని. సావిత్రిగారు చాలామంచివారు .. ఆమెతో కలిసి నటించడం నా అదృష్టం. ఆమెను సెట్లో చూస్తున్నంత సేపు చాలా బాధేసేది .. ఎందుకంటే అప్పటికే ఆమె బాగా పాడైపోయారు. నేను సినిమాల్లోకి రావడానికి ముందు నుంచి ఆమెను చూస్తూ వచ్చినవాడిని. ఆ తరువాత కాలంలో శ్రీదేవి .. జయసుధ .. జయప్రద .. రాధిక.. ఇలా చాలామందితో కలిసి నటించాను" అని చెప్పారు.   
banerjee

More Telugu News