నిరుపేద అమ్మాయికి తమ సొంత ఖర్చులతో ఘనంగా పెళ్లి చేసిన పాఠశాల టీచర్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిరుపేద అమ్మాయికి తమ సొంత ఖర్చులతో ఘనంగా పెళ్లి చేసిన పాఠశాల టీచర్లు!

  • ఆద‌ర్శంగా నిలుస్తోన్న ఉపాధ్యాయులు
  • ఇటువంటి కార్య‌క్ర‌మాల‌ను భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగిస్తామ‌ని వ్యాఖ్య
  • తమ వేతనాల్లోంచి డబ్బును పొదుపు చేసి ఆడపిల్లలకి ఖర్చు
మ‌ధ్యప్ర‌దేశ్‌ విడిశాలోని పిప‌ర్‌గుహ ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉపాధ్యాయులు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఆ గ్రామంలోని ఓ నిరుపేద యువ‌తికి పెళ్లి జ‌రిపించారు. ఇటువంటి కార్య‌క్ర‌మాల‌ను భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. ఆ యువ‌తికి పెళ్లి జ‌రిపించ‌డానికి వారు ఎవ్వ‌రి వ‌ద్దా ఫండ్స్ కూడా తీసుకోలేదు. ప్ర‌తి నెల‌ త‌మ వేత‌నాల్లోంచి కొంత డ‌బ్బుని నిరు పేద ఆడ‌పిల్ల‌ల కోసం పొదుపు చేస్తున్నామ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌యిన బేటీ బ‌చావో బేటీ ప‌డావోకి కూడా త‌మ సేవ‌ల‌ను అందిస్తామ‌ని తెలిపారు. తాజాగా వారు ఓ నిరుపేద అమ్మాయికి జ‌రిపించిన పెళ్లి వేడుక వీడియోను మీరూ చూడండి...  
Madhya Pradesh
marriage
underprivileged
girl

More Telugu News