రామ‌ల‌క్ష్మిగా సమంత అదుర్స్ అంటూ.. నితిన్, రకుల్, మెహ్రీన్ ఫిర్జాదాతో పాటు పలువురి ప్రశంసలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ‌ల‌క్ష్మిగా సమంత అదుర్స్ అంటూ.. నితిన్, రకుల్, మెహ్రీన్ ఫిర్జాదాతో పాటు పలువురి ప్రశంసలు

  • చెరువు వద్ద బట్టలు ఉతుకుతూ సమంత
  • స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డంలో ఎప్పుడూ విఫ‌లం కావు స‌మంత: నితిన్ 
  • రామ‌ల‌క్ష్మిని స్క్రీన్‌పై చూడాల‌ని ఉంది: ర‌కుల్
సుకుమార్, రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న 'రంగ‌స్థ‌లం' సినిమాలో హీరోయిన్‌ని చూపెడుతూ ఈ రోజు టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పల్లెటూరి పడుచుపిల్లలా సమంత చెరువు వద్ద బట్టలు ఉతుకుతూ, నీళ్లు తీసుకొస్తూ, కట్టెలు మోస్తూ కనపడుతోన్న ఈ టీజర్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ టీజర్‌ను పలువురు సెలబ్రిటీలు కొనియాడుతున్నారు.

'నువ్వు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డంలో ఎప్పుడూ విఫ‌లం కావు స‌మంత' అంటూ హీరో నితిన్ ట్వీట్ చేశాడు. 'సూప‌ర్ స‌మంత' అంటూ అక్కినేని అఖిల్ పేర్కొన్నాడు. రామ‌ల‌క్ష్మీని స్క్రీన్‌పై చూడాల‌ని ఉంద‌ని ర‌కుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. 'రామ‌లక్ష్మి... సమంత కెరీర్‌కే ది బెస్ట్ క్యారెక్టర్' అని షాలిని పాండే పేర్కొంది. 'రామలక్ష్మి నా హృదయాన్ని ఎక్కడికో తీసుకెళ్లావ్' అంటూ మెహ్రీన్ ఫిర్జాదా పేర్కొంది.
samantha
rangasthalam
akhil
nitin

More Telugu News