నాన్నకి పారితోషికం ఎగ్గొట్టినవాళ్లు చాలామందే వున్నారు: కాంతారావు తనయుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాన్నకి పారితోషికం ఎగ్గొట్టినవాళ్లు చాలామందే వున్నారు: కాంతారావు తనయుడు

  • కాంతారావుగారు కథ అడిగేవారు కాదు
  • అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చేసేవారు
  • మెయిన్ హీరో అనుకుని సెకండ్ హీరోగా కూడా చేశారు
కాంతారావు తనయుడు రాజా .. తాజాగా తెలుగు పాప్యులర్ టీవీతో మాట్లాడుతూ, తమకి ఎదురైన కొన్ని సంఘటనలను గురించి చెప్పుకొచ్చారు. " మా నాన్న జీవితమంతా ఎదురీతే సరిపోయింది. ఎవరైనా సరే డేట్స్ అడగడం ఆలస్యం వెంటనే ఇచ్చేసేవారు. పేరుకి ఈయనే హీరో అని చెప్పేవారు .. సినిమా చూస్తే వేరే పాత్రకి ప్రాధాన్యత ఉండేది. మెయిన్ హీరో ఈయన అని చెప్పేసి .. సెకండ్ హీరోగా చేయించుకున్న సందర్భాలు కూడా వున్నాయి".

 "అది నేను గ్రహించి మా నాన్నకి చెప్పేవాడిని కూడా. సినిమాల్లో అవన్నీ ఒక భాగమేలే అనేవారే తప్ప, పెద్దగా పట్టించుకునేవారు కాదు. కథ ఈయన అడిగేవారు కాదు .. వాళ్లు చెప్పేవాళ్లు కాదు. ఇక రెమ్యునరేషన్ కూడా సరిగ్గా ఇచ్చేవాళ్లు కాదు. కొంతమొత్తం ఇచ్చి .. మిగతాది నెక్స్ట్ పిక్చర్ లో చూసుకుందాం అంటూ ఎగ్గొట్టిన వాళ్లే ఎక్కువ. మంచితనం కారణంగా ఈయన ఆ డబ్బుల విషయాన్ని ఎవరినీ ఎప్పుడూ అడిగేవారు కాదు " అంటూ చెప్పుకొచ్చారు.   
kantharao
raja

More Telugu News