Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ సలహా ఇచ్చారు.. మా నాన్నగారు పాటించారు!: కాంతారావు తనయుడు

  • చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమా షూటింగుకి వెళ్లాం  
  • అప్పుడాయన అలా అన్నారు 
  • దాంతో నాన్నగారు ఆ నిర్ణయం తీసుకున్నారు
తెలుగు తెరపై ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కాంతారావు ఏక కాలంలో తమ ప్రత్యేకతలు చాటుకున్నారు. అశేష ప్రేక్షకులచే నీరాజనాలు అందుకున్నారు. ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ స్టార్ హీరోగా నిలిచారు. ఇక ఏఎన్నార్ వారసుడిగా నాగార్జున అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచారు. అలాంటిది కాంతారావు వారసుడిగా మీరెందుకు సినిమాల్లోకి రాలేదు?" అనే ప్రశ్న తెలుగు పాప్యులర్ టీవీలో రాజాకి ఎదురైంది.

 అందుకాయన స్పందిస్తూ .. " ఒకసారి నాన్నగారు ఎన్టీఆర్ సినిమా షూటింగుకి తీసుకెళ్లారు. 'బ్రదర్ .. పిల్లల్ని అప్పుడే సినిమాల దిశగా ఎంకరేజ్ చేయకండి. వాళ్ల చదువు పాడైపోతుంది. ఒకవేళ సినిమాల్లో సక్సెస్ కాకపోతే వాళ్లు చాలా డిజప్పాయింట్ అవుతారు. అందువలన వాళ్లను సినిమాల జోలికి రానీయకండి" అని సలహా ఇచ్చారు. దాంతో మా నాన్నగారు మమ్మల్ని సినిమాల వైపు రానీయలేదు" అని రాజా చెప్పుకొచ్చారు. "చెన్నైలో ఉండగా బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున వాళ్లందరితో మంచి పరిచయం ఉండేది. ఇప్పుడు వాళ్లని కలుసుకునే పరిస్థితి లేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.    
kantharao
raja

More Telugu News