Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షియోమి 5ఏకు పోటీగా వచ్చేసిన కొత్త స్మార్ట్ ఫోన్... విడుదల చేసిన ప్యానాసోనిక్

  • 1జీబీ ర్యామ్, 2జీబీ ర్యామ్ పేరుతో రెండు రకాలు
  • ధరలు రూ.5,299, రూ.5,999
  • ఫ్లిప్ కార్టులో అమ్మకాలు
ప్యానాసోనిక్ తాజాగా పీ100 పేరుతో స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే ఇది అమ్మకానికి ఉంటుంది. పీ100లో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. ఇవి షియోమి 5ఏకు గట్టిపోటీనిచ్చేలా ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 2జీబీ ర్యామ్ వెర్షన్లున్నాయి. రెండింటిలోనూ స్టోరేజీ కెపాసిటీ 16 జీబీయే. ఎస్డీ కార్డు ద్వారా విస్తరించుకునే ఆప్షన్ ఉంది. ప్రతీ దానికి విడిగా డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారు.

5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7 నౌగట్ ఓఎస్, 1.25 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ 6737 ప్రాసెసర్, వెనుక 8ఎంపీ, ముందు 5ఎంపీ కెమెరాలు, రెండు వైపులా ఫ్లాష్ సదుపాయం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. గోల్డ్, బ్లూ, బ్లాక్ రంగుల్లో లభిస్తోంది. 1జీబీ ర్యామ్ ధర రూ.5,299, 2జీబీ ర్యామ్ ధర రూ.5,999. ఈ నెల 8 నుంచి 31లోపు కొనుగోలు చేసిన వారు బంగారం గెలుచుకునే ఆఫర్ ను కంపెనీ ప్రకటించింది.
panasonic p100
smart phone

More Telugu News