హైక్, ఎయిర్ టెల్ జట్టు... చౌక ఫోన్లలో టోటల్ సేవలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైక్, ఎయిర్ టెల్ జట్టు... చౌక ఫోన్లలో టోటల్ సేవలు

  • ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా మెస్సేజింగ్, న్యూస్
  • ఇన్ బిల్ట్ గా టోటల్
  • ఎయిర్ టెల్ చందాదారులకు అందుబాటులోకి 
మెస్సేజింగ్ సేవల సంస్థ హైక్, ఎయిర్ టెల్ జట్టుకట్టాయి. ఎయిర్ టైల్ తన చందాదారులకు అందించే చౌక స్మార్ట్ ఫోన్లలో ఇక మీదట హైక్ కు చెందిన టోటల్ ఇన్ బిల్ట్ గా ఉంటుంది. మేరా పెహలా స్మార్ట్ ఫోన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నాయి. హైక్ కు చెందిన టోటల్ అనేది ఆండ్రాయిడ్ కస్టమైజ్డ్ ఓఎస్ సర్వీస్. దీని ద్వారా హైక్ మెస్సెంజర్, ఇతర సేవలను ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా పొందేందుకు వీలు కలుగుతుంది.

వార్తలు, రీచార్జ్, వ్యాలెట్, హోరోస్కోప్, క్రికెట్ స్కోరు, రైళ్ల సమాచారం కూడా పొందొచ్చు. రూ.1 నుంచే డేటా ప్యాక్ ల ను టొటల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. మేరా పెహలా స్మార్ట్ ఫోన్ అన్నది తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందించేందుకు, స్మార్ట్ ఫోన్ల విస్తరణకు ఎయిర్ టెల్ చేపట్టిన పథకం.
hike
total
airtel

More Telugu News