Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేప్‌టౌన్ వన్డేలో భారత్ రికార్డుల మోత!

  • మూడో వన్డేలో భారత్ ఘన విజయం
  • పలు రికార్డులను సొంతం చేసుకున్న టీమిండియా
  • కోహ్లీ ఖాతాలో మరికొన్ని రికార్డులు
దక్షిణాఫ్రికాతో బుధవారం కేప్‌టౌన్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించడంతోపాటు పలు రికార్డులను సృష్టించింది. ఈ మ్యాచ్‌ లో సఫారీలను 124 పరుగుల తేడాతో ఓడించిన భారత్, వరుసగా మూడు వన్డేలను గెలుచుకుని 3-0 ఆధిక్యం సాధించింది. సిరీస్ గెలుపు కోసం భారత్ మరో విజయం సాధిస్తే సరిపోతుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ సొంతమైన రికార్డులు ఇవీ..

* ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో దక్షిణాఫ్రికా 0-3తో వెనుకబడడం ఇదే తొలిసారి
* దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాపై భారత్ అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించడం ఇదే ప్రథమం

* మూడు వన్డేల్లోనూ కలిపి భారత స్పిన్నర్లు 21 వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఆ దేశ గడ్డపై ఇన్ని వికెట్లు తీసుకోవడం కూడా ఇదే మొదటిసారి

* ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అజేయంగా 160 పరుగులు చేశాడు. 1983లో టర్న్‌బ్రిడ్జ్ వెల్స్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్ దేవ్ అజేయంగా 175 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఓ భారత కెప్టెన్ విదేశాల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత పరుగులు ఇవే.

* 12.10 సగటుతో రోహిత్ శర్మ అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాలో భారత బ్యాట్స్‌మన్ అత్యంత చెత్త సగటు ఇదే.

* ఈ వన్డేల్లో సెంచరీ కోసం కోహ్లీ 119 బంతులు ఆడాడు. సెంచరీ కోసం ఇన్ని బంతులు ఆడడం కోహ్లీకి ఇదే తొలిసారి

* కెప్టెన్‌గా కోహ్లీ 12 సెంచరీలు సాధించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరుపై ఉన్న రికార్డును తుడిచేశాడు. గంగూలీ 142 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు చేయగా గంగూలీ 43 ఇన్నింగ్స్‌లలోనే 12 సెంచరీలు బాదాడు.
Virat Kohli
Capetown
South Africa
India

More Telugu News