Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోము వీర్రాజుకు చీవాట్లు పెట్టిన అమిత్ షా?

  • టీడీపీపైన, చంద్రబాబుపైన తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు
  • చంద్రబాబుపై విమర్శలు చేసే అధికారం మీకెవరిచ్చారు?
  • నోరు అదుపులో పెట్టుకోవాలి
  • మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవన్న అమిత్ షా
తెలుగుదేశం పార్టీపైన, ఆ పార్టీ అధినేతపైన తీవ్ర స్థాయి విమర్శలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ షాకిచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ విషయమై వీర్రాజుకు చీవాట్లు పెట్టినట్టు పార్టీ వర్గాల సమాచారం. ‘టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసే అధికారం మీకెవరిచ్చారు? నోరు అదుపులో పెట్టుకోవాలి’ అంటూ సోము వీర్రాజుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారట.

మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారని తెలుస్తోంది. కాగా, సోము వీర్రాజుకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చిన అంశం బీజేపీలో చర్చనీయాంశమైనట్టు పార్టీ వర్గాల సమాచారం.
Andhra Pradesh
bjp
somu veeraj

More Telugu News