అర్ధసెంచరీలతో అదరగొట్టిన శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ

  • టీమిండియా స్కోరు 140/1 (23 ఓవర్లకి)
  • రోహిత్ శర్మ డకౌట్
  • క్రీజులో శిఖర్ ధావన్ (76), కోహ్లీ (59)
కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డేలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు అదరగొడుతున్నారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ ఆరు బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే రబాడా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, అనంతరం క్రీజులో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ మాత్రం ధాటిగా ఆడుతూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ 76, కోహ్లీ 59 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 140/1 (23 ఓవర్లు)గా ఉంది.
Go Back to Shorts
India
Cricket
south africa

More Telugu News