Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నా: కేటీఆర్

  • టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • కాంగ్రెస్ రాకపోతే ఉత్తమ్ తప్పుకుంటారా
  • కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాననే మాటకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సవాల్ కు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటారా? అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని అన్నారు. 
KTR
utham kumar reddy

More Telugu News