స్మార్ట్ ఫోన్ల ధరల తగ్గింపు సీజన్... పాప్యులర్ మోడళ్లపై భారీ తగ్గింపు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్మార్ట్ ఫోన్ల ధరల తగ్గింపు సీజన్... పాప్యులర్ మోడళ్లపై భారీ తగ్గింపు!

  • నోకియా 8, 5 సహా చాలా మోడళ్లపై తగ్గింపులు
  • ఈ జాబితాలో వివో, శామ్ సంగ్, ఆనర్, ఒప్పో, హెచ్ టీసీ ఫోన్లు
  • పోటీ పెరగడంతో దిగొస్తున్న ధరలు
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలకు చెందిన పాప్యులర్ స్మార్ట్ ఫోన్ల ధరలు దిగొస్తున్నాయి. ఒక దాని వెంట ఒక కంపెనీ పలు మోడళ్ల ధరలను సవరిస్తున్నాయి. పోటీ బాగా పెరిగిపోవడంతో మరింత తక్కువ ధరలకే అందించే ప్రయత్నం చేస్తున్నాయి.

ధరలు తగ్గిన మోడళ్లు ఇవే...
  • నోకియా 8 మోడల్ ఆవిష్కరణ ధర రూ.36,999 కాగా, అదిప్పుడు రూ.28,999కు దిగొచ్చింది. రూ.8,000 తగ్గిపోయింది. నోకియా 5 మోడల్ కూడా రూ.13,499 నుంచి రూ.12,499కు తగ్గింది.
  • శామ్ సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ ఆవిష్కరించిన సమయంలో ధర రూ.18,790. అదిప్పుడు 13,900కు దిగొచ్చింది. గెలాక్సీ జే7 ఎన్ఎక్స్ టీ ధర రూ.10,490కు తగ్గింది.
  • వివో వి7 దేశీయ మార్కెట్లో ఆవిష్కరణ ధర రూ.18,990. రూ.2,000 తగ్గింపుతో అదిప్పుడు రూ.16,990కే లభిస్తోంది. వివో వై69 ధర తాజా ధర రూ.13,990. అంటే రూ.1,000 తగ్గింది. వివో వై55 రూ.1,500 తగ్గి రూ.10,490కు లభిస్తోంది.
  • ఆనర్ 8ప్రోను రూ.29,999కు ఆవిష్కరించగా ఏకంగా రూ.4,000 తగ్గిపోయి రూ.25,999కు దిగొచ్చింది.
  • ఒప్పో ఏ71 ను గతేడాది రూ.12,990 ధరకు ఆవిష్కరించగా, ఇది రూ.9,990కు చేరింది.
  • హెచ్ టీసీ యూ11 ధర రూ.51,990 స్థాయి నుంచి రూ.45,999కు దిగొచ్చింది.
  • కూల్ ప్యాడ్ కూల్ 1 3జీబీ+32జీబీ మోడల్ రూ.7,999కే దిగొచ్చింది. 4జీబీ+32జీబీ మోడల్ రూ.8,999కు లభిస్తోంది. అలాగే, కూల్ ప్యాడ్ నోట్ 5 తాజా ధర రూ.7,999. కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ తాజా ధర రూ.5,999.
  • ఆసుస్ జెన్ ఫోన్ 3 ధర రూ.2,000 తగ్గిపోయి రూ.11,999కు లభిస్తోంది. జెన్ ఫోన్ 3 మ్యాక్స్ రూ.8,499కు దిగొచ్చింది. ఇందులోనే మరో మోడల్ ధర రూ.7,999. జెన్ ఫోన్ గో 5 అంగుళాల మోడల్ ధర రూ.6,499. 5.5 అంగుళాల మోడల్ ధర రూ.6,999.
smart phone
prices

More Telugu News