నాలా చేసి చూపించు... విరాట్ కోహ్లీకి సవాల్ విసిరిన రవిశాస్త్రి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాలా చేసి చూపించు... విరాట్ కోహ్లీకి సవాల్ విసిరిన రవిశాస్త్రి!

  • 'ప్యాడ్ మ్యాన్' సవాల్ స్వీకరించిన రవిశాస్త్రి
  • చేతిలో శానిటరీ ప్యాడ్ పట్టుకుని ఫొటో దిగిన టీమిండియా కోచ్
  • కోహ్లీ కూడా అదే పని చేసి చూపించాలని సవాల్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లికి, తాను ఎంతో ఇష్టపడే కోచ్ రవిశాస్త్రి నుంచి ఓ సవాల్ ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి వన్డే పోటీల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరాడా అనుకుంటున్నారా? కాదు. అక్షయ్ కుమార్ ప్రారంభించిన 'ప్యాడ్ మాన్' సవాల్ ను స్వీకరించాలని. మహిళలు నెలసరి సమయంలో వాడే శానిటరీ ప్యాడ్ ను తన చేత్తో పట్టుకుని ఫొటో దిగి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన రవిశాస్త్రి, అదే పని చేసి చూపించాలని కోహ్లీకి సవాల్ విసిరాడు.

రాక్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రారంభించిన 'ప్యాడ్ మ్యాన్' ప్రచారానికి తాను మద్దతిస్తున్నానని చెప్పాడు. తన సవాల్ కోహ్లీతో పాటు గౌతమ్ సింఘానియా, లియాండర్ పేస్ లకు కూడా వర్తిస్తుందని చెప్పాడు. ఈ విషయంపై అక్షయ్‌ కుమార్ బహిరంగ చర్చ లేపడాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నాడు. తన చేతిలోని ప్యాడ్ ను చూపుతూ రవిశాస్త్రి పెట్టిన పోస్టుకు వేల కొలదీ లైక్స్ వస్తున్నాయి.
Ravi Shastri
Virat Kohli
Padman
Challange

More Telugu News