యూపీలో దారుణం... అందరికీ ఒకటే సూది... 40 మందికి హెచ్ఐవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీలో దారుణం... అందరికీ ఒకటే సూది... 40 మందికి హెచ్ఐవీ!

  • ఉన్నావో జిల్లాలో క్లినిక్
  • అందరికీ ఒకే సిరంజ్ వాడిన డాక్టర్లు
  • మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే వెలుగులోకి
  • ట్రక్ డ్రైవర్ల నుంచి వైరస్ వచ్చిందన్న ఆరోగ్య మంత్రి
ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఉన్నావో జిల్లా పరిధిలోని బంగర్ మావ్ ప్రాంతంలో నడుస్తున్న ఓ క్లినిక్ లో ఇంజక్షన్లు చేసేందుకు ఒకటే సూదిని వాడుతూ ఉండటంతో కనీసం 40 మంది హెచ్ఐవీ బారినపడ్డారు. గత సంవత్సరం చివర్లో ఈ ప్రాంతంలో ఓ హెల్త్ క్యాంప్ నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సదరు క్లినిక్ కు వెళ్లిన అందరి రక్త నమూనాలను పరీక్షించాలని నిర్ణయించారు.

"దాదాపు 40 హెచ్ఐవీ కేసులు బయటకు వచ్చాయి. ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తే దాదాపు 500 మందికి ఈ వ్యాధి సోకినట్టు తేలవచ్చు. తమకున్న రోగాలను నయం చేసుకునేందుకు ఆసుపత్రికి వెళితే, అక్కడి డాక్టర్ ఒకే సిరంజిని అందరికీ వాడటమే దీనికి కారణం" అని బంగార్ మావ్ సిటీ కౌన్సిల్ సునీల్. తాము హెల్త్ క్యాంపులు పెట్టిన వేళ ఈ విషయం బయటకు వచ్చిందని, నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆసుపత్రి వైద్యుల లైసెన్స్ లను రద్దు చేశామని, విచారణ కొనసాగుతోందని, ఆసుపత్రికి వచ్చిన కొందరు ట్రక్ డ్రైవర్ల నుంచి వైరస్ వ్యాపించి ఉండవచ్చని ఆరోగ్య మంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
Uttar Pradesh
Hospital
HIV

More Telugu News