యోగి పాలనలో రికార్డు స్థాయి ఎన్ కౌంటర్లు!
- ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసి పది నెలలు
- ఎన్ కౌంటర్ల లెక్కలు విడుదల చేసిన యూపీ ప్రభుత్వం
- ఆపరేషన్ క్లీన్ పేరుతో 1,142 ఎన్ కౌంటర్లు
ఈ క్రమంలో నలుగురు పోలీసులు మృత్యువాతపడగా, 247 మంది గాయపడ్డారు. సీఎం యోగి ఆదేశాల ప్రకారం 'ఆపరేషన్ క్లీన్' పేరుతో నేరస్థుల ఏరివేత చర్యలు వేగంగా జరుగుతున్నాయి. యూపీ పోలీస్ గణాంకాల ప్రకారం, 2017 మార్చి 20 నుంచి 2018 జనవరి 31వరకు యూపీలో మొత్తం 1,142 ఎన్ కౌంటర్లు చోటుచేసుకోగా, మీరట్ జోన్ లో 449, ఆగ్రా జోన్ లో 210 ఎన్ కౌంటర్లు జరిగాయి. 196 ఎన్ కౌంటర్లతో బరేలీ జోన్ మూడో స్థానంలో ఉండగా, 91 షూటౌట్లతో కాన్పూర్ జోన్ నాల్గవస్థానంలో ఉంది.