ఈ అభినందనలన్నీ వాళ్లకే చెందుతాయి : టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
- ఈ విజయం వెనుక కష్టమంతా ఆటగాళ్లదే, నాది కాదు
- ఒత్తిడిని జయిస్తూ జట్టును గెలిపించారు
- ఎంతో బాగా రాణించారు : రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు
ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, ఈ విజయం వెనుక కష్టమంతా ఆటగాళ్లదేనని, తనదేమీ లేదని, ఒత్తిడిని జయిస్తూ జట్టును గెలిపించారని, ఎంతో బాగా రాణించారని ప్రశంసించారు. ప్రణాళికాబద్ధమైన ఆటతీరు, దానిని అమలు పరిచి విజయం సాధించడంలోనే అసలైన సంతృప్తి ఉందని ద్రవిడ్ అన్నారు. అనంతరం, కెప్టెన్ పృథ్వీషా మాట్లాడుతూ, రంజీ, అండర్ -19 మ్యాచ్ లలో తాము పొందిన పరిణతే తమను విజయంబాట పట్టించిందని సంతోషం వ్యక్తం చేశాడు.