ప్రేమికుల రోజున ఆ పాట విడుదల చేస్తాను: అల్లు అర్జున్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమికుల రోజున ఆ పాట విడుదల చేస్తాను: అల్లు అర్జున్‌

  • ‘నా పేరు సూర్య’ సినిమాలోని రెండో పాట ‘లవర్ ఆల్సో ... ఫైటర్ ఆల్సో’
  • రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, విశాల్ శేఖర్ సంగీతం
  • అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూయేల్‌పై అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ
ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘నా పేరు సూర్య’ సినిమాలోని రెండో పాట ‘లవర్ ఆల్సో ... ఫైటర్ ఆల్సో’ ను విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, విశాల్ శేఖర్ సంగీతమందించారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.

‘లవర్ ఆల్సో ... ఫైటర్ ఆల్సో’  పాటను అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూయేల్‌పై అందమైన లొకేషన్స్‌లో అద్భుతంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ‘నా పేరు సూర్య’ సినిమాలోని  మొదటి పాటను విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది.
Allu Arjun
ani emanuel
na peru surya

More Telugu News