పీకల దాకా తాగి.. మాజీ ప్రియుడి ఇంటి ముందుకు వెళ్లి డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో వైరల్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీకల దాకా తాగి.. మాజీ ప్రియుడి ఇంటి ముందుకు వెళ్లి డ్యాన్స్ చేసిన యువతి.. వీడియో వైరల్‌!

  • మ్యూజిక్, పాటల కోసం డీజేను కూడా తీసుకెళ్లిన వైనం
  • గూమిగూడి చూసిన స్థానికులు
  • హర్యానాలోని పటౌడిలో ఘటన
పీకల దాకా తాగిన ఓ యువతి తన మాజీ ప్రియుడి ఇంటి ముందుకు వెళ్లి డ్యాన్స్ చేసిన ఘటన హర్యానాలోని పటౌడిలో చోటు చేసుకుంది. అంతేకాదు, మ్యూజిక్, పాటల కోసం డీజేను కూడా తీసుకెళ్లింది. రాజా హిందూస్థానీ సినిమాలోని 'తేరే ఇష్క్ మే' పాట పెట్టుకుని గంతులేసింది. దీంతో స్థానికులంతా అక్కడ గూమిగూడారు.

అయినప్పటికీ డ్యాన్స్ చేస్తూ హల్‌చల్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో ఉంచడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఆ అమ్మాయితో ప్రేమాయణం జరిపిన ఓ యువకుడు కొన్ని రోజులుగా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె ఇలా ప్రవర్తించినట్లు సమాచారం.   
Drunk
girl
Haryana
dance
Viral Videos

More Telugu News