ఆకట్టుకుంటున్న 'ద రాక్' 'స్కై స్క్రాపర్' సినిమా ట్రైలర్...వీడియో చూడండి
- రాక్ గా పేరుతెచ్చుకున్న డ్వెయిన్ జాన్సన్
- ‘స్కై స్క్రాపర్’ సినిమాలో ఒంటికాలుతో సాహసాలు
- ఆకట్టుకుంటున్న ‘స్కై స్క్రాపర్’ ట్రైలర్
ఈ సినిమాలో డ్వెయిన్ మాజీ ఎఫ్బీఐ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాలు కోల్పోయి, కృత్రిమ కాలుతో కుటుంబం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా డ్వెయిన్ నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమా ట్రైలర్ లో 240 అంతస్తుల భవనంలో డ్వెయిన్ కుటుంబం చిక్కుకోగా, వారిని కాపాడేందుకు ఆ భవనంపై నుంచి దూకడాన్ని ఆసక్తికరంగా చూపారు. ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా లెజెండరీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తుండగా, దీనికి సహనిర్మాతగా డ్వెయిన్ జాన్సన్ వ్యవహరిస్తుండడం విశేషం. జులై 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.