Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా హీరోలు పోటీ పడటంపై అల్లు అర్జున్ సీరియస్ .. త్వరలో మీటింగ్!

  • ఒక రోజు తేడాతో మెగా హీరోల సినిమాలు 
  • ఈ విషయం పట్ల బన్నీ అసహనం 
  • ఇకపై అలా జరగకూడదనే ఆలోచన
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలు తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ చేసిన 'ఇంటిలిజెంట్' ఈ నెల 9వ తేదీన విడుదలవుతుండగా .. వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'తొలిప్రేమ' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విధంగా మెగా హీరోల సినిమాలు పోటీ పడుతూ వస్తుండటం పట్ల అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడని తెలుస్తోంది.

 మెగా హీరోలు పోటీ పడవద్దనీ .. ఈ విధంగా జరగడం వలన విభేదాలు తలెత్తే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నాడట. అంతే కాకుండా ఇలా పోటీపడటం వలన మెగా అభిమానులు కూడా చీలిపోయే అవకాశం ఉందనేది ఆయన అభిప్రాయం. అందువలన మెగా హీరోలు ఎవరైనా తమ సినిమాల రిలీజ్ విషయంలో రెండుమూడు వారాల గ్యాప్ పాటించాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని చెబుతున్నారు. ఈ విషయంలో స్పష్టతను ఇవ్వడం కోసం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరితో కలిసి త్వరలో ఆయన ఓ మీటింగ్ ను ఏర్పాటు చేయనున్నాడని అంటున్నారు. అల్లు అర్జున్ ఆలోచన సరైనదేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.   
Allu Arjun
sai dharam tej
varun tej

More Telugu News