Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గత నాలుగు రోజులుగా మోస్ట్ ట్రెండింగ్ ట్విట్టర్ పోస్టు ఇదే... 2.40 లక్షల లైక్స్, 48 వేల రీట్వీట్స్!

  • లో దుస్తులను ఎంచుకుని ఆపై అవాక్కైన యువతి
  • తన అనుభవాన్ని ట్విట్టర్ లో పంచుకున్న అమ్మాయి
  • నెట్టింట దూసుకెళుతున్న పోస్టు
ఏదైనా వస్త్ర దుకాణానికి వెళ్లి, అక్కడ నచ్చిన దుస్తులను సెలక్ట్ చేసుకుని, వాటిని ఓసారి వేసి చూసుకోవడం, ఆపై నచ్చితే తీసుకోవడం, లేకుంటే అక్కడే వదిలేసిన మరో డ్రస్ వెతుక్కోవడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. అయితే, ఓ డ్రస్ నచ్చి, సైజు సరిపోయిందని తృప్తి పడి, బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లిన తరువాత వినకూడని మాట వింటే... నతాలీ అనే యువతి, ఓ స్టోర్ కు వెళ్లి, అక్కడ తనకు నచ్చిన లో దుస్తులను తీసుకుని కౌంటర్ వద్దకు వెళ్లిన వేళ తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. జనవరి 31న ఆమె ఈ పోస్టును పెట్టగా, సుమారు రెండున్నర లక్షల మంది లైక్ కొట్టారు. మరో 48 వేల మంది ఈ ట్వీట్ కు రీట్వీట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

ప్రైమాక్స్ స్టోర్ కు నతాలీ వెళ్లింది. అక్కడ లోదుస్తుల కోసం ఆమె వెతుకుతుంటే, మనసుకు నచ్చిన బ్రా కనిపించింది. ఆ బ్రా తనకు నప్పుతుందని భావించిన నతాలీ, దానిపై ప్రైస్ కోడ్ లేకపోవడాన్ని చూసి సూపర్ వైజర్ ను సంప్రదించింది. అతను కూడా కాసేపు అటూ ఇటూ తిరిగి చివరకు ఏం చెప్పాడో ఊహించండి... "ఇది మా షాప్ లోని బ్రా కాదు. దీన్ని ఎవరో కావాలనే ఇక్కడ వదిలెళ్లారు. ఎవరిదో వాడేసిన బ్రా హ్యాంగర్ కు తగిలించి, కొత్తది తీసుకుపోయారు" అని చెప్పాడు. ఇక ఎవరో వాడేసిన బ్రాను తాను ధరించి చూసుకుని, తెచ్చానా? అంటూ నతాలీ తన అనుభవాన్ని ట్విట్టర్ లో తెలిపింది. ఇక ఆమె ట్వీట్ తరువాత వేలాది మంది స్టోర్స్ లో తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
Natalie
Twitter
Bra

More Telugu News