నా సినిమాలో చిరంజీవి, పవన్ హీరోలు... కథ సిద్ధమైందన్న టీఎస్ఆర్
- త్వరలోనే చిత్రం షూటింగ్ మొదలు
- మార్చి 11న 'కాకతీయ కళోత్సవం'
- హన్మకొండలో టీ సుబ్బరామిరెడ్డి
కాకతీయుల కళా వైభవాన్ని చాటి చెప్పేలా వచ్చే నెలలో వరంగల్ కోట వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. మార్చి 11న 'కాకతీయ కళోత్సవం' పేరిట ఇది జరుగుతుందని టీఎస్ఆర్ తెలిపారు. దేశంలోని పురాతన ఆలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కాగా, టీఎస్ఆర్ వెంట ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఉన్నారు.