అది వెకిలి నవ్వో, ప్రేమ నవ్వో తెలియదు!: పేర్లు వెల్లడించకుండా మోహన్ బాబు విమర్శలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అది వెకిలి నవ్వో, ప్రేమ నవ్వో తెలియదు!: పేర్లు వెల్లడించకుండా మోహన్ బాబు విమర్శలు!

  • 'గాయత్రి' ప్రమోషన్ లో బిజీగా ఉన్న మోహన్ బాబు
  • నాకు ఒకరిద్దరు మాత్రమే స్నేహితులు
  • సినీ ఇండస్ట్రీలో నిజమైన స్నేహితులు లేరు
  • చాలా మందిలో ఈగో: మోహన్ బాబు
తాను నటించిన తాజా చిత్రం 'గాయత్రి' ప్రమోషన్ లో బిజీగా ఉన్న విలక్షణ నటుడు మోహన్ బాబు, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన వేళ, ఇండస్ట్రీలో స్నేహితులపై ప్రశ్న రాగా, కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఒకరిద్దరు మాత్రమే మిత్రులని, ఇక ఇండస్ట్రీలో నిజమైన స్నేహితులు అంతగా లేరని అన్నారు. చాలా మంది తాను కనిపిస్తే నవ్వు నవ్వేసి వెళ్లిపోతారని, అది వెకిలి నవ్వో లేక ప్రేమ పూర్వక నవ్వో అర్థం కాదని చెప్పారు. తన విషయాలేవీ మరొకరితో పంచుకోబోనని చెప్పారు.

ఇటీవలి కాలంలో కొందరితో సన్నిహితంగా ఉండాలని చూసి విఫలమయ్యానని చెప్పారు. చాలా మందిలో ఉన్న ఈగో చూసి ఆశ్చర్యపోయానని, వారి పేర్లు మాత్రం చెప్పబోనన్నారు. 'తాను ఏదైనా పని ఉండి ఎవరికైనా ఫోన్ చేస్తే, ఆ సమయంలో అందుబాటులో లేకపోయినవారు, ఎందుకు చేశానో అని ఆలోచించి కనీసం ఆ తర్వాతైనా చేయరు' అన్నారు. వంద సంపాదించి, రెండొందలు సంపాదించినట్టు డబ్బాలు కొట్టుకుంటూ ప్రజలను కొందరు మోసం చేస్తున్నారని, పబ్లిసిటీ కోసం లేనిపోనివి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సినిమా ఆడకుంటే లోపం ఉన్నట్టేనని తెలిపారు.
Tollywood
Mohan Babu
Gayatri

More Telugu News