డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఎన్నారై యువకుల హంగామా... రెండు గంటల పాటు నానాయాగీ!
- మందు కొట్టి పట్టుబడిన ఎన్నారై యువకులు
- కారులో మద్యం సీసాలు, హుక్కా
- తనిఖీలకు సహకరించకుండా రెండు గంటల పాటు గొడవ
డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడితే తిరిగి విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని యువకులు వాదించగా, నిబంధనలు ఎవరికైనా ఒకటేనని పోలీసులు హెచ్చరించారు. ఇక ఫిల్మ్ నగర్ తనిఖీల్లో 9 టూవీలర్లు, 7 కార్లు పట్టుబడగా, మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని, వారికి కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతామని తెలిపారు.