వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమలాపాల్‌పై విశాల్ ప్రశంసలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమలాపాల్‌పై విశాల్ ప్రశంసలు

  • ఆమె ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్
  • లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయించడానికి నిజంగా చాలా తెగింపు, పట్టుదల కావాలి
  • కేసు నమోదు చేసుకుని, చర్యలు తీసుకున్న పోలీసు శాఖకు ధన్యవాదాలు
  • నిందితుడికి సరైన శిక్ష ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను
డ్యాన్స్ స్కూల్ య‌జ‌మాని, వ్యాపారి అళగేశన్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని హీరోయిన్‌ అమలాపాల్ ఇటీవల చెన్నైలోని మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. నిందితుడిని పోలీసులు ఇప్ప‌టికే అరెస్టు చేశారు. అమ‌లాపాల్ ధైర్యాన్ని సినీన‌టుడు విశాల్ మెచ్చుకున్నారు. ఆమె ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశాడు. లైంగిక వేధింపులపై కేసు నమోదు చేయించడానికి నిజంగా చాలా తెగింపు, పట్టుదల కావాలని అన్నాడు. కేసు నమోదు చేసుకుని, చర్యలు తీసుకున్న పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు, నిందితుడికి సరైన శిక్ష ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని అన్నాడు.  
vishal
amala paul
chenni

More Telugu News