నాతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తిని చూపించారు: 'నిన్నుకోరి' దర్శకుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తిని చూపించారు: 'నిన్నుకోరి' దర్శకుడు

  • 'నిన్నుకోరి' చూశాక కొంతమంది హీరోలు ఫోన్ చేశారు 
  • ఆ సినిమా విషయంలో నన్ను అభినందించారు 
  • నాతో సినిమా చేస్తామని చెప్పారు
వైవిధ్యభరితమైన కథా కథనాలతో 'నిన్నుకోరి' సినిమాను నడిపించిన దర్శకుడు శివ నిర్వాణ , యూత్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాడు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'నిన్నుకోరి ' సినిమా సక్సెస్ ను గురించి మాట్లాడాడు.

 " 'నిన్నుకోరి' సినిమా హిట్ అయిన తరువాత కొంతమంది హీరోల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి .. దాదాపు వాళ్లందరినీ నేను కలవడం జరిగింది. 'నిన్నుకోరి' సినిమాను తీసిన విధానాన్ని గురించి ప్రస్తావిస్తూ వాళ్లంతా అభినందించారు. ఏదైనా కథ ఉంటే చెప్పు శివ అన్నారు. చెప్పు .. చేద్దాం అని వాళ్లు అన్నప్పటికీ, అందుకు కథ రెడీ కావాలి .. హీరో ఖాళీగా ఉండాలి .. ఇద్దరం కలిసి ఆ కథపై చర్చలు జరపాలి. ఆ కథ హీరోకి నచ్చినప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. అలా హీరోలను ఒప్పించే దశలో ప్రస్తుతం వున్నాను" అని చెప్పుకొచ్చాడు.    
shiva nirvana

More Telugu News