కనిపించకుండా పోయిన సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభ్యం
- బాపట్లలోని రిసార్ట్ లో సీఐ
- పట్టుకున్న నల్గొండ పోలీసులు
- నిర్ధారించిన ఐజీ స్టీఫెన్ రవీంద్ర
నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు సమాచారం. దీంతో, డిపార్ట్ మెంట్ సిమ్ కార్డు, రివాల్వర్ ను అప్పగించి, ఆయన ఎవరికీ కనిపించకుండా పోయారు. తన పర్సనల్ ఫోన్ ను కూడా స్విచ్ఛాప్ చేసుకున్నారు.