ఇది ఇంటర్వెల్ మాత్రమే... అసలు సినిమా ముందుంది: బీజేపీపై శివసేన

  • రాజస్థాన్ ఫలితాలు ఇంటర్వెల్ మాత్రమే
  • 2019లో బీజేపీకి అసలు సినిమా ఉంది
  • బీజేపీతో కలిసే అవకాశమే లేదు
రాజస్థాన్ బైపోల్స్ లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీపై శివసేన సెటైర్లు వేసింది. రాజస్థాన్ లో వచ్చిన ఫలితాలు కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని... 2019లో అసలైన సినిమా ఉంటుందని శివసేన ఎంపీ సంజయ్ రావత్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అసలు సత్తా ఏంటో అందరికీ అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలపబోమని... ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. ఒక్కసారి విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలితే... అది తిరిగి వెనక్కి రాదని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేపర్ల మీద బాగానే ఉందని... క్షేత్ర స్థాయిలో అవన్నీ అమలైతేనే బడ్జెట్ విజయవంతం అయినట్టని చెప్పారు. నిన్న రాజస్థాన్ లో వెలువడిన ఉపఎన్నికల ఫలితాల్లో రెండు లోక్ సభ సీట్లతో పాటు ఒక అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
Go Back to Shorts
shivsena
BJP
sanjay rawat

More Telugu News